అతి ఆలోచనలు కేవలం మానసిక ఆరోగ్యానికి కాదు, శారీరక ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ ఆలోచనల కారణంగా మానసిక వేదన బారిన పడి… నిద్ర పట్టక ఇబ్బంది పడతారు. ఆ నిద్రలేని వల్ల ఎన్నో రకాల రోగాలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు, హైబీపీ పేషెంట్లు ప్రతిరోజూ ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్ర పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అతి ఆలోచనలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరే బిజీ చేసుకోండి. మీకు ఇష్టమైన పనిలో నిమగ్నం అవ్వండి.