వన్​ప్లస్ 13 ట్రిపుల్ కెమెరా సెటప్​తో రానుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. ఇందులో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

పర్ఫార్మెన్స్​: రియల్​మీ జీటీ 7 ప్రో- వన్​ప్లస్ 13 రెండూ స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్​తో పనిచేస్తాయి. భారత్​లో ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​ 16 జీబీ ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్, 1 టీబీ యూఎఫ్ఎస్ 4.0 వరకు స్టోరేజ్​ని అందించే అవకాశం ఉంది. అయితే వన్​ప్లస్ 13 చైనా వేరియంట్ 24 జీబీ ర్యామ్​ని అందిస్తోంది. అదనంగా, రెండు పరికరాలు ఏఐ ఫీచర్లు- టూల్స్​ను అందించవచ్చు.

బ్యాటరీ: భారతదేశంలో, రియల్​మీ జీటీ 7 ప్రో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5800 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. వన్​ప్లస్ 13లో 100వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here