కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో గార్లదిన్నె పని కోసం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వారి స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాంజమనమ్మ, బాల గద్దయ్య, డి.నాగమ్మ, నాగమ్మ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన కూలీలను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిని ఎస్పీ, డీఎస్పీ పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు…ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు.
Home Andhra Pradesh వ్యవసాయ కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఏడుగురి మృతి-సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి-anantapur garladinne road...