దేశంలో ఓలా ఎలక్ట్రిక్​కి, ఓలా ఎలక్ట్రిక్​ కస్టమర్లకు కష్టాలు కొనసాగుతున్నాయి! ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్ల సర్వీస్​ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. సర్వీస్​ బాగోలేదన్న కారణంగా ఓలా ఎలక్ట్రిక్​ షోరూమ్​ని కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి తగలబెట్టిన వార్త వినే ఉంటారు. ఇక ఇప్పుడు.. మరో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఓనర్ షోరూమ్​ ముందే, తన వాహనాన్ని సుత్తితో ధ్వంసం చేశాడు. ఈవీని కొనుగోలు చేసిన నెల రోజుల్లోనే రూ.90,000 సర్వీసింగ్ బిల్లు వచ్చిందని, అందుకే ఇలా చేసినట్టు అతను చెప్పుకోచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here