మొదటి గంటలో ఫిర్యాదు కీలకం

సైబర్‌ నేరాల్లో ఎక్కువగా ఓటీపీ, తప్పుడు సమాచారం, మోసపూరిత హామీలతో జరిగే లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్ల బారిన పడ్డామని గుర్తించిన వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బు వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేరగాళ్లు వినియోగించిన బ్యాంకు ఖాతాలను గుర్తించి వాటిలో లావాదేవీలను నిలిపివేయడానికి వీలవుతుంది. బ్యాంకు ఖాతాల నుంచి మరో ఖాతాకు జరిగే లావాదేవీలను బ్యాంకులు అమోదించడానికి గంట వ్యవధి ఉంటుంది. నేరగాళ్లు డబ్బును మళ్లించినా, వాటిని నగదుగా మార్చుకున్నా తిరిగి రాబట్టడానికి తొలి గంటలో ఫిర్యాదు చేయడం కీలకం. మీ చిరునామా, స్థానం, ఫోన్, ఆధార్, పాన్, పుట్టిన తేదీ లేదా ఏదైనా వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా సందేశాల ద్వారా ఎవరితోనూ పంచుకోవద్దు. కాల్‌లో మీ పేరును గుర్తించడానికి కూడా నిరాకరించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here