‘అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నిర్ణయాలు తీసుకుని గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మీ అనాలోచిత, అవినీతి విధానాల కారణంగా గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 4 లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా? ఉపాధ్యాయులు, విద్యార్థులను సిద్ధం చెయ్యకుండానే సీబీఎస్ఈ పరీక్షా విధానం తీసుకొచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక సీబీఎస్ఈ పరీక్షా విధానంలో నిర్వహించిన పరీక్షల్లో 90 శాతం మంది ఫెయిలయ్యారు. నీ నిర్ణయాలు బ్లైండ్‌గా ఫాలో అయితే.. ఆ పిల్లలు అంతా బోర్డు పరీక్షల్లో తప్పి డిప్రెషన్లోకి వెళ్లేవారు. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం పెంచకుండా, టోఫెల్, ఐబీ శిక్షణ ఇచ్చేవారు లేకపోయినా అమలు చేశామని డబ్బా కొట్టుకోవడం. ఇలా ఒక్కటేంటి విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాపం మీదే జగన్‘ అని లోకేష్ విమర్శించారు.
Home Andhra Pradesh విద్యార్థులకు రూ.6,500 కోట్ల బకాయిలు.. జగన్‌కు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్!-minister nara lokesh strong...