ఏవీ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో- బక్కా జడ్సన్ ఆరోపణలు
హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం హైడ్రాను రూపొందించింది. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా…బుల్డోజర్లతో విరుచుకుపడుంది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. హైడ్రా కూల్చివేతలతో విమర్శలు రావడంతో… ఇటీవల కాస్త స్పీడ్ తగ్గించింది. కూల్చివేతలతో హైడ్రా సామాన్యుల ఆగ్రహానికి గురైంది. తాజాగా హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేశారు.