అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)డిసెంబర్ 4 న వివాహ బంధం ద్వారా ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియాలో ఉన్నఅక్కినేని నాగేశ్వరరావు(anr)విగ్రహం దగ్గర జరిగే ఆ వివాహ వేడుకకు  కేవలం మూడువందల అతిధులని మాత్రమే అక్కినేని కాంపౌండ్ ఆహ్వానిస్తుంది. తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని శోభిత పూర్తి చేస్తున్న నమ్మకం కూడా తనకి ఉందని చైతన్య ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పడంతో ఈ వివాహానికి ఉన్న ఇంపార్టన్స్ ని అర్ధం చేసుకోవచ్చు.

ఇక తమ వివాహాన్ని ఒక డాక్యుమెంటరీగా చిత్రీకరించి ప్రేక్షకుల ముందుంచాలనే ప్లాన్ లో చైతు, శోభిత   ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.ఆ డాక్యుమెంటరీలో చైతన్య కెరీర్, వ్యక్తి గత జీవితంలో ఎదురైన ఇబ్బందులు,శోభిత తో పరిచయం,ప్రేమ,పెళ్లి గురించి చూపించనున్నారని అంటున్నారు.ప్రముఖ హీరోయిన్ నయనతార గతంలో తన పెళ్లిని డాక్యుమెంట్ రూపంలో చిత్రకరించింది.’బియాండ్ ది ఫెయిరీ టేల్’ గా సిద్దమైన ఆ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ వస్తుంది.ఇక చైతు, శోభిత ల డాక్యుమెంటరీ హక్కులు పొందేందుకు నెట్ ఫ్లిక్స్ తో పాటు పలు ఓటిటి సంస్థలు పోటీపడుతున్నాయి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here