నీ వల్లే ఒక్క మాట అనలేదు
ఆ తర్వాత ఇంటికి వస్తాడు కార్తీక్. కారు దిగగానే మీటింగ్లో ఏమైందని, తాతయ్య ఏమైనా అన్నారా అని దీప అడుగుతుంది. తనను ఘోరంగా అవమానించారని, మాటలతో కాదు చేతలతో చేశారని కార్తీక్ అంటాడు. తాను ఇప్పటి వరకు సీఈవోగా ఉండే వాడినని, ఇప్పుడు ముఖ్యమైన పోస్ట్ నుంచి తనను తీసేశారని చెబుతాడు. దీంతో దీప, కాంచన షాక్కు గురవుతుంది. సీఈవో ఎవరు అని కాంచన అడిగితే.. జ్యోత్స్న అని కార్తీక్ సమాధానం ఇస్తాడు. నాన్న ఇలా అవమానిస్తాడని తాను అనుకోలేదని కాంచన అంటుంది. సంస్థలో పని చేయలేనని రాజీనామా ఇచ్చానని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న లెటర్ చించేసి కొనసాగాలని చెప్పిందని చెబుతాడు. శత్రువుగా చూస్తుంది వారని, తాను కాదని కార్తీక్ అంటాడు. తాను వద్దాన్నా అప్పుడు సీఈవోను చేశారని, ఇప్పుడు తీసేశారని బాధపడతాడు. అంతా వాళ్ల ఇష్టం ప్రకారం జరుగుతుందని అంటారు.