కలెక్టర్ సార్ కనీసం మాకు మంచి అన్నం పెట్టించండని విద్యార్థులు ఆందోళనకు దిగిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అటు కరీంనగర్ కలెక్టరేట్, ఇటు జగిత్యాల కలెక్టరేట్ కు విద్యార్థులు వెళ్లి ధర్నా చేశారు. ఉడికి ఉడకని అన్నం తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించిన 400 మంది విద్యార్థులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.