జలజీవన్ మిషన్ కు బడ్జెట్ ను పెంచాలని కేంద్రమంత్రిని కోరామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పోలవరంపై సీఎం మాట్లాడుతారన్న ఆయన.. గత ప్రభుత్వం చేసిన తప్పులు వారసత్వంగా వస్తున్నాయన్నారు. ఏపీలో జనజీవన్ మిషన్ పై రెండు మూడు వారాల్లో డీపీఆర్‌ ఇస్తామన్నారు. ప్రధాని మోదీతో భేటీలో జల జీవన్ మిషన్ పై చర్చిస్తానన్నారు. ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీరు అందించాలనేది ప్రధాని మోదీ లక్ష్యం అన్నారు. ఏపీలో పైప్ లైన్స్, డిజైనింగ్ లోపాలు ఉన్నాయన్నారు. సౌర విద్యుత్ టెండర్ల అవినీతిపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వలో సమోసలకే రూ.9 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎంత బాధ్యతారాహిత్యం వ్యవహరించారో అర్థం అవుతుందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఏపీలో పర్యాటకరంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పవన్ అన్నారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశం ఉన్న టూరిజాన్ని సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here