ప్రముఖ నటి కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. చిరకాల మిత్రుడు ఆంటోనీతో కీర్తి వివాహం జరగనున్నట్లు న్యూస్ వినిపించింది. ఆ న్యూస్ ని నిజం చేస్తూ, తాజాగా తన లవ్ ని కన్ఫర్మ్ చేసింది కీర్తి. (Keerthy Suresh)
తాజాగా సోషల్ మీడియాలో ప్రియుడు ఆంటోనీతో ఉన్న ఫొటోని షేర్ చేసిన కీర్తి.. “15 years and counting” అని రాసుకొచ్చింది. కేరళకు చెందిన దుబాయ్ బిజినెస్ మ్యాన్ ఆంటోనీతో కీర్తి 15 ఏళ్లుగా ప్రేమలో ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. కీర్తి తాజా పోస్ట్ తో అది నిజమని స్పష్టమైంది. అదే విధంగా విజయ్ దళపతితో పెళ్లి అంటూ గతంలో వచ్చిన రూమర్స్ కి కూడా కీర్తి చెక్ పెట్టినట్లయింది. గతంలో కీర్తి-విజయ్ ప్రేమలో ఉన్నారని, భార్యకు విడాకులిచ్చి కీర్తిని విజయ్ పెళ్లాడనున్నాడని ప్రచారం జరిగింది. కీర్తి తాజా పోస్ట్ తో ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.