రూ.2 కోట్లు రెమ్యూనరేషన్లో నిజమెంత?
టాలీవుడ్లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్గా ఉన్న శ్రీలీల.. ఈ కిస్సిక్ ఐటెం సాంగ్ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలు వస్తున్నాయి. వారం రోజుల పాటు ఈ పాట కోసం డేట్స్ కేటాయించిన శ్రీలీల.. రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుందని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఇదే విషయాన్ని శ్రీలీలను ఓ సినిమా జర్నలిస్ట ప్రశ్నించగా.. ఈ ముద్దుగుమ్మ సమాధానమిచ్చింది.