“ఇంకా ఒక్క రోజులో అదృష్టం భాస్కర్ తలుపు తడుతుంది. భాస్కర్ మీ తలుపు తడతాడు. రేపటి నుంచి లక్కీ భాస్కర్ మూవీని తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ, హిందీల్లో చూడండి” అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఓ ట్వీట్ చేసింది. లక్కీ భాస్కర్ మూవీ ఓటీటీ హక్కుల్ని నెట్‌‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ ధరకి దక్కించుకుంది. మూవీ ఇప్పటికే థియేటర్ల నుంచి కనుమరుగు కావడంతో.. స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. లక్కీ భాస్కర్ సినిమా బడ్జెట్ రూ.56 కోట్లుకాగా.. ఇప్పటి వరకూ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.109.82 కోట్లని వసూలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here