చలికాలం ఎక్కువగా కనిపించే దుంపల్లో క్యారెట్లు ఒకటి. ఈ సీజన్లో క్యారెట్లు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తినాల్సిందే. సీజనల్ గా దొరికే ఆహారాలను ఆయా సీజన్లో తినాల్సిందే. క్యారెట్ వినియోగం కూడా ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఎప్పుడూ ఆరెంజ్ రంగు క్యారెట్లనే తింటూ ఉంటారు. వీటిలో మరో రకం నల్ల క్యారెట్ రకం. నల్ల క్యారెట్ల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎరుపు క్యారెట్ల మాదిరిగానే, నల్ల క్యారెట్లు కూడా ఆరోగ్యానికి ఒక వరమనే చెబుతారు. నల్ల క్యారెట్లు తినడం వల్ల అందం కూడా పెరుగుతుంది. వీటిలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, ఆంథోసైనిన్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.