Sangareddy Crime : మద్యానికి బానిసైన ఓ యువకుడు ఒక దొంగతనం చేయగా…అది మరో మూడు చోరీలకు దారితీసింది. చివరికి చోరీల విషయం ఊరిలో తెలిసి పంచాయితీకి పిలవగా.. భయంతో మంజీరాలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు దూకడం చూసి తల్లి సైతం నదిలో ఆత్మహత్యకు పాల్పడింది.