అల్లుఅర్జున్(allu arjun)వన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదలవ్వడానికి తుది మెరుగులు దిద్దుకుంటుంది.ఈ క్రమంలోనే అన్ని లాంగ్వేజస్ లో ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి.వీటీల్లో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక కూడా పాల్గొని సందడి చేస్తున్నారు.ఇక పుష్ప 2 రిలీజ్ పాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున జరుగుతుండంతో చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ ని వాయిదా వేస్తున్నాయి.

ఈ క్రమంలోనే హిందీలో భారీ బడ్జెట్ తో,భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ‘చావా'(chhaava)మూవీ కూడా తమ రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకుంది. ఎందుకంటే పుష్ప 2 డిసెంబర్ 5 న హిందీలో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.దీంతో డిసెంబర్ 6 న విడుదల కావాల్సిన చావా ఫిబ్రవరి 14 కి వాయిదా పడింది.పుష్ప తో పోటీ ఎందుకని భావించే ‘చావా’ టీం వాయిదా నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక చేస్తుండటం విశేషం.  

మరాఠా యోధుడు ‘ఛత్రపతి శివాజీ'(chhatrapati shivaji maharaj)తనయుడు ‘శంభాజీ మహారాజ్'(Chhatrapati Sambhaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘శంభాజీ మహారాజ్’ భార్య ‘ఏసుబాయి’ క్యారక్టర్ లో రష్మిక(rashmika)కనపడనుంది.లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో దినేష్ విజన్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here