పనిభారంతో పాటు నిర్లక్ష్యం కూడా…
సచివాలయ ఉద్యోగులకు విధి నిర్వహణలో స్వతంత్ర గుర్తింపు లేకపోవడంతో వారిలో జవాబుదారీతనం కూడా లోపించింది. దీనికి తోడు వివిధ ప్రభుత్వ శాఖలు క్షేత్ర స్థాయి పనులకు సచివాలయ ఉద్యోగులను వాడుకుంటున్నాయి. ఎవరికి వారు తాము అప్పగించిన పని మొదట పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల సర్వే, జియో ట్యాగింగ్ పూర్తి చేసే బాధ్యత అప్పగించింది. అది ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని చోట్ల బయో మెట్రిక్, ఐరీస్ యంత్రాలు పనిచేయక పోవడం, మరికొన్ని చోట ఇతర పని ఒత్తిళ్లతో జియో ట్యాగింగ్, ఇంటింటి సర్వేను అటకెక్కించారు.