ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇండ్ల మంజూరుకు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.