నందమూరి బాలకృష్ణ(balakrishna)నటవారసుడు,నందమూరి మోక్షజ్ఞ(mokshagna)డెబ్యూ మూవీకి హనుమాన్(hanuman)ఫేమ్ ప్రశాంత్ వర్మ(prashanth varma) దర్శకుడనే విషయం తెలిసిందే. మైథలాజికల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద నందమూరి అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ రీసెంట్ గా మోక్షజ్ఞ లుక్ ని రిలీజ్ చెయ్యడం జరిగింది.

సాధారణ గళ్ళచొక్కా ధరించి,పొడవాటి హెయిర్,స్టైలిస్ట్ గడ్డంతో ఉన్న మోక్షజ్ఞ, తనని తాను అద్దంలో చూసుకుంటూ ఉన్నాడు.ఈ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రశాంత్ వర్మ’యాక్షన్ కోసం సిద్ధమా! సింబా ఈజ్ కమింగ్’ అనే హ్యాష్ టాగ్ ని కూడాజత చేసాడు.ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడమే కాకుండా నందమూరి ఫ్యాన్స్ అయితే మోక్షజ్ఞ లుక్ సహజమైన తేజస్సు తో పాటు, మోక్షజ్ఞ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా చెప్పేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రెజంట్ ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కూడా ఉంది.మూవీ ఓపెనింగ్ రోజు రిలీజ్ చేసిన మోక్షజ్ణ ఫస్ట్ లుక్ కూడా  అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. 

గతంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన సుధాకర్ చెరుకూరి, బాలయ్య చిన్న కూతురు తేజశ్వని తో  కలిసి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మిస్తున్నారు.డిసెంబర్ 5 న మూవీ ప్రారంభం కాబోతుందనే వార్తలు అయితే ఫిలిం సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ మేరకు మేకర్స్ నుంచి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.మిగతానటినటులు,సాంకేతిక నిపుణుల వివరాలు కూడా ఓపెనింగ్ డే రోజే ప్రకటించే అవకాశం ఉంది.


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here