Khammam Student Dies in USA : అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. చికాగో లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన 26 ఏళ్ల సాయి తేజ మృతి చెందాడు. నాలుగు నెలల క్రితమే సాయితేజ అమెరికా వెళ్లినట్లు తెలిసింది. స్వగ్రామం రామన్నపేటలో విషాదం నెలకొంది.