(3 / 8)
‘బాలికా వధు’ (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ కూడా బిగ్ బాస్‌లో పాల్గొంది. 2016లో ప్రత్యూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో పెద్ద ఆనంది పాత్రలో ప్రత్యూష నటించింది. ఇదే సీరియల్‌తో సిద్దార్థ్ శుక్లా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్‌లో పాల్గొన్న సిద్ధార్థ్ శుక్లా, ప్రత్యూష బెనర్జీ ఇద్దరు చనిపోవడం విషాదకరం.