భారతీయులకు వాస్తు శాస్త్రం ఎంత ముఖ్యమైనదో చైనీయులకు ఫెంగ్ షూయి అంటే అంత ముఖ్యమైనది. వ్యక్తుల జీవితాలను సంతోషకరంగా, ఆరోగ్యదాయకంగా ఉంచేందుకు వీటిలో కొన్ని సిద్ధాంతాలు నియమాలు ఉంటాయి. అదృష్టం, విజయం వరించేలా చేసేందుకు ఇవి చాలా బాగా సహాయపడతాయి. శక్తుల ప్రవాహాన్ని సమతుల్యం చేయడం, ఆరోగ్యం, సంపద, సాఫల్యం, సామరస్, శాంతి కలిగించే మార్గాలను సూచించడం ఈ శాస్త్రంలో భాగం. ఫెంగ్ షూయి ప్రకారం ఇంట్లో లాఫింగ్ బుద్ధ, విండ్ చిమ్, ఫిష్ అక్వేరియం, చైనీస్ కాయిన్, క్రిస్టల్ బాల్ వంటి కొన్ని వస్తువులను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుందని నమ్ముతారు. జీవితంలోని అన్ని బాధలు,ఇబ్బందులు తొలగిపోయి కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఇవే కాకుండా వాస్తు లోపాల కారణంగా తలెత్తే అవరోధాలను అడ్డుకునేందుకు, అదృష్టం వరించేందుకు ఫెంగ్ షూయిలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.