అతిమధురం వాడకం ఇలా.. టీ తయారీ
- అతిమధురం వేరును నేరుగా కూడా నమలవచ్చు. ఓ ముక్కను ఆ నోట్లో వేసుకొని నమలాలి.
- అతిమధురంతో టీ కూడా చేసుకోవచ్చు. ముందుగా వీటి వేర్లపై ఉన్న తొక్కను తొలగించాలి. ఆ తర్వాత ఓ కప్పు నీళ్లలో రెండు అతిమధురం మూలిక ముక్కలను వేసి సుమారు 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. దీంతో నీళ్లలోకి అతిమధురం గుణాలు దిగుతాయి. ఆ తర్వాత వడగడితే టీ తయారవుతుంది. ఈ టీలో రుచి కోసం తేనె వేసుకోవచ్చు. నీరు మరిగే సమయంలో కావాలంటే కాస్త దంచిన అల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు.
- అతిమధురం మూలికలను పొడిలా చేసుకోవచ్చు. ఈ పొడి, తేనె సమాన మోతాదులో కలిపి తినొచ్చు. అతిమధురం పొడితోనూ టీ చేసుకోవచ్చు.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం
అతిమధురం వేర్లలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేషన్ గుణాలు ఉంటాయి. మరిన్ని పోషకాలు ఉంటాయి. అతిమధురం మూలికలు వాడితే జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశనం కలుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.