దీంతో గులాబీ పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఇరువర్గాల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడించింది. అప్పటికే పోలీసులు బలగాలు అక్కడ మోహరించడం, బీఆర్ఎస్ నేతలకు, వారికి మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చేయి దాటే అవకాశం ఉంటడంతో రాకేష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 50 మంది కార్యకర్తలను మడికొండ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దాదాపు గంట పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా.. అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.