Hydra : హైడ్రాకు రేవంత్ సర్కారు సపోర్ట్ పెంచింది. ఇన్నాళ్లు విశేష అధికారాలు ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా భారీగా నిధులు కేటాయించింది. దీనిపై హైడ్రా అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు హైదరాబాద్ నగరంలో హైడ్రా ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. హైడ్రా చీఫ్ రంగనాథ్ చిత్రపటానికి ప్రజలు పాలాభిషేకం చేశారు.