సిల్వర్ స్క్రీన్ వద్ద విజయ్ దేవరకొండ(vijay devarakonda)రష్మిక(rashmika)ఫెయిర్ కి మంచిక్రేజ్ ఉంది.గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల ద్వారా మెప్పించిన ఆ జంట,మరోసారి కలిసి నటిస్తే చూడాలని ఇరువురి అభిమానులతో పాటు,ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఇద్దరు వేరు వేరు చిత్రాలతో బిజీగా ఉన్నారు.విజయ్ తన కెరీర్ లో పన్నెండవ చిత్రంగా తెరకెక్కుతున్నమూవీతో బిజీగా ఉండగా, పుష్ప 2 రిలీజ్ తర్వాత తన అప్ కమింగ్ చిత్రాల షూటింగ్ లో రష్మిక పాల్గొనబోతుంది.
వాటిల్లో ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీ కూడా ఒకటి. గీతా ఆర్ట్స్ లో తెరకెక్కుతుండగా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది.ఇప్పుడు ఈ మూవీ టీజర్ కి విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రష్మిక క్యారక్టర్ ని పరిచయం చేయడంతో పాటుగా, నెరేట్ చేయడం లాంటి సీన్స్‌కు విజయ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడని అంటున్నారు.పైగా ఆ టీజర్ ని పుష్ప 2 రిలీజ్ రోజు థియేటర్స్ లో ప్లే చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇక చాలా కాలం నుంచి రష్మిక, విజయ్ లవ్ లో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రష్మిక ఈ విషయం మీద చిన్న క్లూ కూడా ఇచ్చింది.ఈ నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ రోజు విజయ్ వాయిస్ ఓవర్ తో వస్తున్న గర్ల్ ఫ్రెండ్ టీజర్ మీద మంచి క్రేజ్ ఏర్పడింది.గీతా ఆర్ట్స్ తో పాటు,మాస్ మూవీ మేకర్స్,ధీరజ్ మొగిలినేని గర్ల్ ఫ్రెండ్ ని నిర్మిస్తుండగా ప్రముఖ నటుడు,చిల సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.