2. రియల్మీ జీటీ 7 ప్రో
స్నాప్ డ్రాగన్ 8 ఎలీట్ తో వచ్చిన మరో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రియల్మీ (Realme) జీటీ 7 ప్రో. ఇది 16 జిబి LPDDR5X ర్యామ్, 512 జిబి స్టోరేజ్ తో వస్తుంది. ఇది గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి ఇంటెన్సివ్ టాస్క్ లకు పవర్ హౌజ్ గా మారుతుంది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్ కూడా ఉన్నాయి. 12 జీబీ+256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రియల్మీ జీటీ 7 ప్రో (Realme GT 7 Pro) ధర రూ.59,999 కాగా, 16 జీబీ+512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.65,999గా ఉంది. అమెజాన్, రియల్మీ ఇండియా, పలు ఇతర ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ సేల్ నవంబర్ 29న ప్రారంభమైంది.