మారుతున్న జీవన శైలిలో పని ఒత్తిడి కారణంగా వ్యాయామం చేసే అవకాశం తగ్గిపోతోంది. నడక, రన్నింగ్ చేయకుండా జంక్ ఫుడ్ అధికంగా తినడం వల్ల పొట్ట కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. రోజంతా ల్యాప్ టాప్ ముందు కూర్చోవడం, అధిక ఒత్తిడికి గురికావడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం వేగంగా పెరుగుతోంది. ఎంతో మంది బరువు పెరిగే సమస్యతో బాధపడుతున్నారు. మీ ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చడం ద్వారా, మీరు మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేయవచ్చు. ప్రముఖ యోగా గురువు హంసాజీ యోగేంద్ర బెల్లీ ఫ్యాట్ తగ్గించే టీ రెసిపీని అందించారు. దీన్ని ప్రతిరోజూ రాత్రి తాగితే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.