శివారెడ్డి, ఆయన కుమారుడు రాజశేఖర్ రెడ్డి, రైతు బేల్దరి లక్ష్మినారాయణ రెడ్డి (45) కలిసి స్లాబ్ కింద భాగంలో కర్రలను అమరుస్తుండగా.. ఒక్కసారిగా స్లాబ్ మొత్తం వారిపై కూలిపోయింది. లక్ష్మినారాయణరెడ్డి అక్కడికక్కడే మృతి చెండారు. శివారెడ్డి, రాజశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం హిందూపురం తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో శివారెడ్డి మృతి చెందారు. రాజశేఖర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో శెట్టిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Home Andhra Pradesh అనంతపురం జిల్లాల్లో విషాదం.. ఇంటి మిద్దె కూలి కుమార్తె సహా దంపతులు మృతి-couple and daughter...