తిరుమల శ్రీవారిని ప్రముఖలు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. గాయని స్మిత తన కూతురితో కలిసి వెంకన్న దర్శనం చేసుకున్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రకు చెందిన రాజకీయ నాయకులు స్వామి సేవలో పునీతులు అయ్యారు. సోమిరెడ్డి, మంత్రి వాసంశెట్టి, మంత్రి పొంగులేటి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి తీర్ధప్రసాదాలు అందజేశారు వేద పండితులు.