రాజ్యసభలో నగదు పట్టుబట్టం కలకలం రేపింది. ఐదు వందల నోట్లు పదుల సంఖ్యలో లభించటంతో విచారణకు చైర్మన్ జగదీప్ ధన్ కడ్ ఆదేశించారు. ఈ నోట్ల కట్టలు కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ ఉన్న సీటు వద్ద తమకు లభించినట్లు చైర్మన్ తెలిపారు. అయితే ఆ పేరు ప్రస్తావించటంపై కాంగ్రెస్ పక్ష నేత ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు.