చీర భారతీయతకు చిహ్నం. అందులో కంచిపట్టు చీరకు మరింత ప్రాముఖ్యత ఉంది. నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి ఫోటోల్లో అందరినీ ఆకర్షించినది శోభితా కట్టుకున్న కంచిపట్టు చీరే. ఈ చీర కోసం ఆమె తన బంధువులతో కలిసి కాంచీపురం వెళ్లి అక్కడ నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుంది. స్వచ్ఛమైన, ప్రసిద్ధమైన పట్టుతో నేసిన చీర కావాలంటే కాంచీపురం వెళ్లాల్సిందే. అక్కడ తయారయ్యే కంచి పట్టు చీరలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి. దీనికి కొంతమంది కంచి పట్టుచీర అని పిలిస్తే, మరికొందరు కాంజీవరం చీర అంటారు. ఎలా పిలిచినా ఈ పట్టుచీర అందమే వేరు.