అర్హులైన వారికే..
సమాజంలోని అన్ని విభాగాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వీరపాండియన్ స్పష్టం చేశారు. పేద, బలహీన వర్గాలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కష్టాలను తీర్చడానికి.. పెన్షన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించారు. అందుకే అనర్హులను తొలగించి, అర్హులైన వారికి పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.