టాలీవుడ్‌లోకి ఎంట్రీ…

కిల్ల‌ర్‌ సినిమా టైటిల్ కింద ఉన్న సూప‌ర్ షీ అనే క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. ఈ కిల్ల‌ర్ మూవీతోనే సుకు పూర్వ‌జ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. హీరో, డైరెక్ట‌ర్‌గానే కాకుండా ప్ర‌జ‌య్ కామ‌త్‌, ప‌ద్మ‌నాభ‌రెడ్డితో క‌లిసి సుకు పూర్వ‌జ్ కిల్ల‌ర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తూన్నాడు.గ‌తంలో ద‌ర్శ‌కుడిగా మాట‌రాని మౌన‌మిది, శుక్ర అనే సినిమాలు చేశాడు సుకు పూర్వ‌జ్‌. అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏ మాస్ట‌ర్ పీస్ మూవీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అర‌వింద్ కృష్ణ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీలో జ్యోతిరాయ్ ఓ కీల‌క పాత్ర పోషించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here