‘ఈ రోజు సోనియాగాంధీ 78వ జన్మదినం. ఈ సందర్భంగా ఈ సభ తరఫున, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంతో, ఇక్కడ ప్రజలతో సోనియాగాంధీది విడదీయలేని అనుబంధం. 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, మన దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.