మండలంలోని ధారపల్లి, కొండపల్లి, బాపన్నధార, బురదకోట, వంతాడ, కొండతిమ్మాపురం, లింగంపర్తి, పొదురుపాక, పాండవులపాలెం, తాడువాయి, పెదమల్లాపురం, వేళంగి, అనుమర్తి, ఆవెల్తి, ఓండ్రేగుల గ్రామాలను ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాలలో పులి సంచరించవచ్చని అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత ఏడాది కూడా ఆహారం కోసం పులి సంచరించింది. పోలవరం ఎడమ గట్టు మీదుగా సంచరిస్తూ పలు గ్రామాల్లో పులి పశువులపై దాడి చేసింది. దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఆ తర్వాత దాని అచూకీ దొరకలేదు.
Home Andhra Pradesh కాకినాడ జిల్లాలో పులి కలకలం.. ఏడాదిన్నర తర్వాత మళ్లీ జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన పెద్దపులి-tiger panic...