వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని సంపద, శ్రేయస్సు, విలాసం, ప్రేమ, వివాహం, అందం, సౌకర్యాల కారక గ్రహంగా పరిగణిస్తారు. తొమ్మిది గ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహంగా కూడా చెబుతారు. జాతకంలో శుక్రుడు అనుకూలంగా ఉంటే జీవితంలో శ్రేష్ఠత, ఊహ, దుబారాలను నియంత్రిస్తుంది. సంగీతం, కవిత్వం, పెయింటింగ్, గానం, నటన, నాటకం, ఒపెరా వంటి వినోదాలు, అలంకారాల వైపు ఆసక్తి చూపేలా చేస్తుంది. శుక్రుడి సంచారంలో మార్పు కచ్చితంగా వ్యక్తుల జీవితం మీద పడుతుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం.. శుక్రుడు నెలకు ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు. అతని సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఒక రాశిలో శుక్రుడు ఉన్నతంగా ఉంటే వారికి అన్ని రకాల యోగాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 2 024 చివరి నెల అయిన డిసెంబర్ చివరిలో అంటే డిసెంబర్ 28న శుక్రుడు కుంభ రాశికి వెళ్తాడు. తిరిగి జనవరి 28 వరకూ అదే రాశిలో సంచరిస్తాడు. శుక్రుడి కుంభ రాశి ప్రయాణం 2025 కొన్ని రాశుల వారికి శుభారంభం కానుంది. ఏయే రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.