మంత్రివర్గంలో చోటు కోసం పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అదిష్ఠానానికి లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికి ఛాన్స్ లేదని.. తనను కెబినెట్లోకి తీసుకోవాలని కోరారు. ఆయనతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వినోద్, వాకటి శ్రీహరి, మదన్ మోహన్ రావు, మైనార్డీ కోటలో షబ్బర్ అలీ, ఫిరోజ్ ఖాన్ తదితరులు మంత్రి పదవులను ఆశిస్తున్నారు.