APSRTC Allowance : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు మంజూరు చేసింది. రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్స్ ఇచ్చేలా జీవో విడుదల చేసింది. వేతనంతో కలిపి ఉద్యోగులకు నైటౌట్ అలవెన్స్ ఇవ్వనుంది. దీంతో ఉద్యోగులకు నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు అదనంగా అందే వీలు ఉందని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, నైటౌట్ అలవెన్స్ చెల్లింపులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. నైటౌట్ అలవెన్స్ ప్రకటించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Home Andhra Pradesh ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, నైటౌట్ అలవెన్సులు ప్రకటన-ap govt good news to...