ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ఫోటోలను పెట్టడం వలన కూడా వాస్తు ప్రకారం మంచిదే. చాలా మంది ఇంటిని అందంగా అలంకరించుకోవాలని, కుటుంబ సభ్యుల ఫోటోలని పెడుతూ ఉంటారు. అది ప్రేమ, ఐకమత్యానికి చిహ్నం. వాస్తు శాస్త్రం ప్రకారం కుటుంబ సభ్యుల ఫోటోలని పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అయితే, ఫోటోలను సరైన దిశలో పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహించి సంతోషంగా ఉండడానికి అవుతుంది.