పింఛన్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తప్పుడు వయసుతో 3 లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో రూ.7 వేల కోట్లు దొంగ పెన్షన్ల రూపంలో కొట్టేస్తున్నారని మండిపడ్డారు. అది చాలా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ పెన్షన్లు తీసివేస్తే ఓట్లు వేయమని అంటున్నారని, తనకు ఓట్లు వేసినా వేయకపోయినా పర్వాలేదన్నారు.