సంవత్సరం నుంచి విడిగానే..
మెయింటెనెన్స్ కోరుతుంది, కానీ, విడాకులకు మాత్రం తన భార్య దరఖాస్తు చేయలేదని ఆ వ్యక్తి తెలిపారు. పెళ్లయి 18 నెలలు అయిందని, గత 13 నెలలుగా తను, తన భార్య విడిగానే ఉంటున్నామని చెప్పారు. “ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేస్తే, ఆమె వాటిని సులభంగానే పొందుతుంది. నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను. నేను పునర్వివాహం చేసుకుంటాను. పిల్లలను కంటాను. సంతోషకరమైన భవిష్యత్తును నిర్మించుకుంటాను. కానీ, అది ఆమెకు ఇష్టం లేదు. అందుకే తను నాకు విడాకులు ఇవ్వదు’’ అని వివరించాడు.