శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ ఈ ఏడాది విడుదలైంది. ఈ మొబైల్ 6.9 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, ఓఐఎస్ సపోర్ట్ తో మరో 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 5000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని వస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1,21,999గా ఉంది.