Mohammed Shami: టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఏడాదికిపైగా జట్టుకు దూరంగా ఉన్న పేస్ బౌలర్ మహ్మద్ షమి.. ఆస్ట్రేలియా వెళ్లడం లేదు. అతని ఫిట్‌నెస్ పై సోమవారం (డిసెంబర్ 23) అప్డేట్ ఇచ్చింది బీసీసీఐ. ఈ మధ్యే తన ఫిట్‌నెస్ నిరూపించుకొని బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్, తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు. అయితే ఆ సమయంలో అతని మోకాలులో వాపు వచ్చిందని, దీంతో అతడు ఆస్ట్రేలియా సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండబోడని బోర్డు స్పష్టం చేసింది.