రైతులు సంఘాల అభ్యంతరాలు
ఉపాధి హామీ జాబ్ కార్డుల్లో భూమి ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని పూర్తి చేసుకున్న వారి జాబితా తీస్తున్నారు. ఈ తరహాలోనే 90, 80, 70 రోజులు….ఇలా ఎక్కువ పని దినాలు పూర్తి చేసిన వారి లిస్టులను రూపొందిస్తున్నారు. వీరిలో లబ్దిదారులకు ఆర్థిక సాయం చేయనున్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో నాలుగు రోజుల్లో అమలు చేసే ఈ పథకానికి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంపై రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వ్యవసాయ కూలీల్లో వివిధ కారణాలతో 100 రోజుల పని దినాలు పూర్తి చేయని వారు ఉంటారని, వారికి ఎలా లబ్దిచేకూరుస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఒంటరి మహిళలకు ఇందులో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అతి తక్కువ భూమి ఉన్న చిన్న రైతులకు రైతు భరోసాలో పెద్దగా ఏం లబ్దిచేకూరదని, అలాంటి వారిని కూడా వ్యవసాయ కూలీలుగా పరిగణించాలని రైతులు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.