పులి పంజా ఎట్టా ఉంటుందో..
‘నాలుగేళ్లలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్లు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు. ఇది అభిమానంతో ఆవిర్భవించిన పార్టీ. జగన్ అభిమానులే కార్యకర్తలు, నాయకులుగా ఉన్న పార్టీ. మీలాగ గుంటనక్కల్లా కాదు.. పులి పంజా ఎట్టా ఉంటుందో.. అట్టా దెబ్బ కొడతాం’ అని సజ్జల రామకృష్ణా రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సజ్జల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.