Jr NTR Fan Discharge : జూ.ఎన్టీఆర్ మాట నిలబెట్టుకున్నారు. తన అభిమాని ప్రాణాలు కాపాడారు. రూ.12 లక్షల బిల్లు కట్టి, ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించారు. దేవర సినిమా టైమ్ లో ఎన్టీఆర్ వీరాభిమాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన కుమారుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని, దేవర సినిమా చూసే వరకు తన బిడ్డను బతికించాలని కౌశిక్ తల్లి వేడుకున్న వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఎన్టీఆర్ స్పందించి, తన అభిమానితో వీడియో కాల్ మాట్లాడారు. అతడి చికిత్సకు అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభుత్వం పరంగా సాయం అందించారు. అయితే ఇటీవల కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ నుంచి తమకు సాయం అందలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయం చేసిన తప్పుగా మాట్లాడుతున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Home Andhra Pradesh మాట నిలబెట్టుకున్న జూ.ఎన్టీఆర్, అభిమాని ఆసుపత్రి బిల్లు క్లియర్ చేయించి డిశ్చార్జ్-jr ntr fan discharged...