ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాను ఇండియా లెవల్‌లో కాకుండా ప్రపంచ స్థాయిలో పని చేయాలని సీఎం భావించారని తెలిపారు. ఇంటర్నేషనల్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ జరిగేలా అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. టికెట్ ధరల పెంపు చాలా చిన్న విషయం అని దిల్ రాజ్ స్పష్టం చేశారు.