ఒక నెలలో 1.42 కోట్ల మంది విమాన ప్రయాణికులు
గత కొన్ని నెలలుగా విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2024 నవంబర్లో దేశీయ మార్గాల్లో దాదాపు 1.42 కోట్ల మంది ప్రయాణించారు. ఇది అంతకుముందు సంవత్సరం నవంబర్ తో పోలిస్తే సుమారు 12 శాతం ఎక్కువ. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజా డేటా ప్రకారం, “2024 జనవరి-నవంబర్ మధ్య దేశీయ విమానయాన సంస్థలు (airlines) తీసుకువెళ్ళిన ప్రయాణికులు 1,464.02 లక్షలు, అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో 1,382.34 లక్షలు, తద్వారా వార్షిక వృద్ధి 5.91 శాతం, నెలవారీ వృద్ధి 11.90 శాతం నమోదైంది.